గోవిందమాల భక్తులను అన్నమయ్య బాటలో అనుమతించాలి : పేర్ని నాని
తిరుమల, 7 డిసెంబర్ (హి.స.) గోవిందమాల భక్తులను అన్నమయ్య బాటలో (Annamayya Bata) అనుమతించాలని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని (Perni Nani) ప్రభుత్వాన్ని కోరారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మాట్లాడుతూ స్వామివారి మీద ఏకాగ్రమైన భక్తితో చాలా
పేర్ని నాని


తిరుమల, 7 డిసెంబర్ (హి.స.)

గోవిందమాల భక్తులను అన్నమయ్య బాటలో (Annamayya Bata) అనుమతించాలని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని (Perni Nani) ప్రభుత్వాన్ని కోరారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మాట్లాడుతూ స్వామివారి మీద ఏకాగ్రమైన భక్తితో చాలా మంది భక్తులు గోవిందమాల వేసుకుంటారన్నారు. వారంతా కాలినడకన తిరుమల కొండకు నడుచుకుంటూ వస్తారన్నారు. అందులో అన్నమయ్య కాలిబాట ఎంతో పురాతనమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ మార్గాన్ని మూసివేయడం బాధాకరమన్నారు. గోవిందమాల వేసుకున్న భక్తులు అన్నమయ్య బాట గుండా రానిస్తే బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొన్ని శతాబ్దాల నుంచి ఉన్న మార్గం అని.. తాళ్లపాక అన్నమయ్య నడిచినప్పటి నుంచి ఎంతో ప్రాశస్త్యం పొందిందని వివరించారు. నాటి నుంచి విరివిగా భక్తులు కాలినడక ఆ మార్గంలో వస్తున్నారన్నారు. తిరుమల శ్రీవారంటే భావోద్వేగం అన్నారు. గోవింద మాలధారులు అటుగా రావడం సెంటిమెంట్ అని పేర్కొన్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు ఈ విషయంపై పునరాలోచించాలని కోరారు.

న్నమయ్య కాలిబాట మార్గంలో తుంబుర, నారద తీర్థాలు కూడా వస్తాయి. గతంలో టీటీడీ చైర్మనుగా ఆకేపాటి చెంగల్ రెడ్డి ఉన్నప్పుడు అన్నమాచార్యుల కాలిబాటను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రాజంపేటకు చెందిన వివిధ వర్గాల వారితో సర్వే చేయిస్తూ తాళ్లపాక నుంచి తిరుమలకు కాలిబాటలో రావాలని సూచించారు. ఆ క్రమంలో స్థానికులు కుక్కలదొడ్డి నుంచి తిరుమలకు నడకదారిలో చేరుకొని పరిస్థితులను పరిశీలించారు. అయితే అటవీ ప్రాంతం కావడం వల్ల అభివృద్ధి పనులకు ఆస్కారం ఏర్పడలేదు. తిరుమల కొండ నుంచి ఈ దారి 15 కిలో మీటర్లు ఉంటుంది. చెట్లు, చేమలు, రాళ్లు రప్పలతో ఆహ్లాదకర వాతావరణం అందిస్తోంది. అయితే ప్రత్యేకంగా రోడ్డు వంటి సౌకర్యాలు ఏమి లేవు. తిరుమల నుంచి కుక్కల దొడ్డి వరకు రోడ్డు నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. రు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande