పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
తెలంగాణ, ఆదిలాబాద్. 25 మే (హి.స.) గ్రామ పాలన అధికారుల నియామకం కోసం రాత పరీక్షను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని మావల పరిధిలోని నలంద కళాశాలలో కొనసాగుతున్న
ఆదిలాబాద్ కలెక్టర్


తెలంగాణ, ఆదిలాబాద్. 25 మే (హి.స.)

గ్రామ పాలన అధికారుల నియామకం కోసం రాత పరీక్షను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆదిలాబాద్ జిల్లాలోని మావల పరిధిలోని నలంద కళాశాలలో కొనసాగుతున్న గ్రామ పాలన అధికారుల రాత పరీక్ష కేంద్రంను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్ష కొనసాగుతున్న తీరును పరిశీలించారు. అదేవిధంగా అభ్యర్థుల హాజరు శాతాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డిఓ వినోద్ కుమార్, తదితరులు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande