ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ ఊహాగానాలపై స్పందించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్
హైదరాబాద్, 25 మే (హి.స.) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడుతుందనే వార్తలను కొట్టిపారేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. కవిత కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలపై స్పందిస్తూ.. ఈ వార్తలు కేవలం ఊహాగానాలేనని క్లారిటీ ఇచ్చారు. ఇంకా ఏమైనా ఉంట
ఎమ్మెల్యే గంగుల


హైదరాబాద్, 25 మే (హి.స.)

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడుతుందనే వార్తలను కొట్టిపారేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. కవిత కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలపై స్పందిస్తూ.. ఈ వార్తలు కేవలం ఊహాగానాలేనని క్లారిటీ ఇచ్చారు. ఇంకా ఏమైనా ఉంటే కొత్త పార్టీ పెట్టినపుడు మాట్లాడతానని అన్నారు. బీఆర్ఎస్కు ఎప్పటికీ కేసీఆర్ మాత్రమే నాయకుడని స్పష్టం చేశారు. కవిత కేసీఆర్కు రాసిన లేఖ ద్వారా బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలను బయటపడ్డాయని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపిస్తూ.. కవిత కొత్త పార్టీ పెడతారంటూ తీవ్ర చర్చలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కమలాకర్ మాట్లాడుతూ... కవిత బీఆర్ఎస్ లోనే కొనసాగుతారని, పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ఈ ఊహాగానాలను రాజకీయ లబ్ది కోసం వాడుతోందని విమర్శించారు. కవిత లేఖలో కేసీఆర్పై విమర్శలు చేయడం, బీజేపీతో రహస్య ఒప్పంద ఆరోపణలు చేయడం వంటివి బీఆర్ఎస్ ఇమేజ్ను దెబ్బతీస్తున్నప్పటికీ ఆమె బీఆర్ఎస్కు విధేయురాలని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande