ప్రణాళిక బద్ధంగా కాలనీలా అభివృద్ధి.. బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద..
హైదరాబాద్, 25 మే (హి.స.) కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కాలనీలు, బస్తీలను ప్రణాళిక బద్దంగా ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గాజుల రామారం డివిజన్ పరిధిలోని వీనస్ రాక్స్ హైట్స్ లో
ఎమ్మెల్యే వివేకానంద


హైదరాబాద్, 25 మే (హి.స.)

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కాలనీలు, బస్తీలను ప్రణాళిక బద్దంగా ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గాజుల రామారం డివిజన్ పరిధిలోని వీనస్ రాక్స్ హైట్స్ లో సుమారు రూ. 36.80 లక్షల వ్యయంతో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఇవాళ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని అన్నీ ప్రాంతాలలో మౌలిక వసతులను కల్పించామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande