హైదరాబాద్, 25 మే (హి.స.)
హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో కంటెస్టెంట్లను వేశ్యల్లా చూస్తున్నారని, ఇది తనకు నచ్చలేదని, అందుకే పోటీల నుంచి తాను తప్పుకుంటున్నానని మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆమెకు చేదు అనుభవం ఎదురైనందుకు చింతిస్తున్నానని తన అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి..‘మిస్ వరల్డ్ లాంటి అంతర్జాతీయ వేదికలపై మహిళలతో వివక్షాపూరిత ఆలోచనలు ఉన్న మెంటాలిటీనీ ఎదిరించడానికి చాలా ధైర్యం కావాలి. మిల్లా మ్యాగీ.. మీరు ఒక బలమైన మహిళ. మా తెలంగాణలో మీరు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నందుకు మేం చింతిస్తున్నాం. తెలంగాణలో మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి ఉంది. ఇక్కడ మహిళలను పూజిస్తాం, గౌరవిస్తాం, వారి అభివృద్ధికి సమాన అవకాశాలను కల్పిస్తాం. రాణి రుద్రమ, చిట్యాల ఐలమ్మ వంటి గొప్ప నాయకులు మా తెలంగాణ మట్టిలో పుట్టినవారే’ అని కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్