తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల.. 93.87% ఉత్తీర్ణత..
హైదరాబాద్, 25 మే (హి.స.) ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో టీజీ ఈసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలక్రిష్ణ రెడ్డి విడుదల చేశారు. ఈసెట్ ఫలితాల్లో 93.87 శాతం ఉత్తీర్ణత సాధించారు. మెటలార్జికల్ ఇంజినీరింగ్, బీఎస్సీ మ్యాథ్స్, ఫార్మసీలో
ఈసెట్ ఫలితాలు విడుదల


హైదరాబాద్, 25 మే (హి.స.)

ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో టీజీ ఈసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలక్రిష్ణ రెడ్డి విడుదల చేశారు. ఈసెట్ ఫలితాల్లో 93.87 శాతం ఉత్తీర్ణత సాధించారు. మెటలార్జికల్ ఇంజినీరింగ్, బీఎస్సీ మ్యాథ్స్, ఫార్మసీలో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ కుమార్, ఆచార్య చంద్రశేఖర్ పాల్గొన్నారు.

బీఎస్సీ మ్యాథ్స్ లో సంతోష్ కుమార్, కెమికల్ ఇంజినీరింగ్ లెంక తేజ సాయి, సివిల్ ఇంజినీరింగ్లో గోల్కొండ నిఖిల్ కౌశిక్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్లో శ్రీకాంత్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ కట్లే రేవతి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్లో కాసుల శ్రావణి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్సుట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ లో రాపర్తి చందన, మెకానికల్ ఇంజినీరింగ్ లో పోతుగంటి కార్తిక్, మెటలర్జికల్ ఇంజినీరింగ్లో తోట సుబ్రహ్మణ్యం, మైనింగ్ ఇంజినీరింగ్లో కుర్మా అక్షయ, ఫార్మసీలో ఐలి చందన మొదటి ర్యాంకు సాధించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande