వైసిపి నేత మాజీ మంత్రి కాకాని.గోవర్ధన్ రెడ్డి నీ పోలీసు బెంగళూరులో అరెస్ట్ చేసి నెల్లూరు పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు
నెల్లూరు, 26 మే (హి.స.) :ఎట్టకేలకు బెంగళూరు )లో పోలీసులు అరెస్టు () చేసిన వైసీపీ నేత (, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ని నెల్లూరు పోలీసు శిక్షణ కేంద్రానికి తీసుకువచ్చారు. ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో కాకాణిని విచారిస్తున్నారు. సోమవారం తెల్లవా
వైసిపి నేత మాజీ మంత్రి కాకాని.గోవర్ధన్ రెడ్డి నీ పోలీసు బెంగళూరులో అరెస్ట్ చేసి నెల్లూరు పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు


నెల్లూరు, 26 మే (హి.స.)

:ఎట్టకేలకు బెంగళూరు )లో పోలీసులు అరెస్టు () చేసిన వైసీపీ నేత (, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ని నెల్లూరు పోలీసు శిక్షణ కేంద్రానికి తీసుకువచ్చారు. ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో కాకాణిని విచారిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున వెంకటాచలం పీహెచ్‌సీకి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం పోలీసు శిక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి వెంకటగిరి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. కాకాణి అరెస్టు విషయం తెలుసుకున్నవైసీపీ నేతలు, కార్యకర్తలు నెల్లూరు, వెంకటగిరికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. డీటీసీ దగ్గరకు మీడియాను పోలీసులు అనుమతించలేదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande