రానున్న నాలుగు రోజులపాటు ఏపీ తెలంగాణలో విస్తృత వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ సూచన
హైదరాబాద్, 26 మే (హి.స. రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీతో పాటు తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మోస్తరు నుంచి భారీ వ
వర్షాలు


హైదరాబాద్, 26 మే (హి.స.

రాబోయే రెండు రోజుల్లో నైరుతి

రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీతో పాటు తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు ఏపీకి చెందిన ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కురిసే అవకాశముంది.

అంతేకాకుండా, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురవచ్చని హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలో మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande