గత.పదకొండేళ్లుగా వరుసగా రెండేళ్లకోసారి కరాటేలో ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్న అక్కచెల్లెళ్ళు
హైద్రాబాద్, 26 మే (హి.స.) , : గత పదకొండేళ్లుగా వరుసగా (రెండేళ్లకోసారి) కరాటేలో ప్రత్యేకమైన అంశాలను ఎంచుకొని ప్రపంచ రికార్డులను సృష్టిస్తున్నారీ అక్కాచెల్లెళ్లు.. జి.అమృతరెడ్డి, జి.ఘన సంతోషినీరెడ్డిలు 11 విభాగాల్లో 11 నిమిషాల లక్ష్యాన్ని ఎంచుకొని 121
గత.పదకొండేళ్లుగా వరుసగా రెండేళ్లకోసారి కరాటేలో ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్న అక్కచెల్లెళ్ళు


హైద్రాబాద్, 26 మే (హి.స.)

, : గత పదకొండేళ్లుగా వరుసగా (రెండేళ్లకోసారి) కరాటేలో ప్రత్యేకమైన అంశాలను ఎంచుకొని ప్రపంచ రికార్డులను సృష్టిస్తున్నారీ అక్కాచెల్లెళ్లు.. జి.అమృతరెడ్డి, జి.ఘన సంతోషినీరెడ్డిలు 11 విభాగాల్లో 11 నిమిషాల లక్ష్యాన్ని ఎంచుకొని 121 ఆత్మరక్షణ మెలకువలను ప్రదర్శించారు. కేవలం 9.36 నిమిషాల్లో పూర్తి చేయడంతో ‘వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లలో చోటుదక్కించుకున్నారు. ఆదివారం ఈ కార్యక్రమం నారాయణగూడలోని జీవీఆర్‌ కరాటే అకాడమీ వేదికగా నిర్వహించారు. వీరికిది ఆరో ప్రపంచ రికార్డు కావడం విశేషం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 2015 నుంచి వీరిద్దరూ రికార్డులు సృష్టిస్తూనే ఉన్నారు. వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధి బింగి నరేందర్‌గౌడ్, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధి లయన్స్‌ విజయలక్ష్మి ధ్రువపత్రాలు అందజేశారు. కార్పొరేటర్లు మహాలక్ష్మీగౌడ్, ఉమా రమేష్‌యాదవ్, అమృత, సంగీత యాదవ్, పోతం దీపిక, ఖలీలుద్దీన్, డా.కృష్ణారెడ్డి, జీఎస్‌ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande