హైదరాబాద్, 26 మే (హి.స.)
ఒక వ్యక్తి మరొక వ్యక్తిని బీర్ బాటిల్ తో తల పై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే రామాంతపూర్ లోని గుడ్ డే బార్ లో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో దారుణం జరిగింది. అంబర్పేట్ పటేల్ నగర్ కు చెందిన హరి, పవన్, శ్రవణ్ బార్ లో మద్యం సేవిస్తున్నారు. హరి, శ్రవణ్ మధ్య గొడవ జరుగుతుండగా పవన్ కుమార్ (25) గొడవ ఆపడానికి వెళ్ళాడు. శ్రవణ్ అనే వ్యక్తి పవన్ కుమార్ తల పై బీర్ బాటిల్ తో కొట్టడంతో పవన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..