వీధి కుక్కల దాడి నుండి జింకను కాపాడిన గ్రామస్తులు..
తెలంగాణ, నిజామాబాద్. 26 మే (హి.స.) నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో దారి తప్పి వచ్చిన జింకపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్ర గాయాలు పాలు చేసిన ఘటన యాద్గార్ పూర్ గ్రామం లో సోమవారం చోటు చేసుకుంది. ఈ దాడిలో జింకకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికు
జింకపై వీధి కుక్కల దాడి


తెలంగాణ, నిజామాబాద్. 26 మే (హి.స.)

నిజామాబాద్ జిల్లా కోటగిరి

మండలంలో దారి తప్పి వచ్చిన జింకపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్ర గాయాలు పాలు చేసిన ఘటన యాద్గార్ పూర్ గ్రామం లో సోమవారం చోటు చేసుకుంది.

ఈ దాడిలో జింకకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వీధి కుక్కలను తరిమివేశారు. గాయాల పాలైన జింకను సురక్షిత ప్రదేశంలోకి తీసుకొచ్చి అటవీ శాఖ అధికారులకు సమాచారమందించారు. గ్రామానికి చేరుకున్న అధికారులు ఘటన కు సంబంధించిన వివరాలు తెలుసుకొని, గాయల పాలైన జింకను కోటగిరి పశు వైద్యశాలకు తరలించారు. స్థానిక వెటర్నరీ డాక్టర్ సురేష్ కుమార్ జింక కు చికిత్స అందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande