యోగేంద్ర ప్రచార కార్యక్రమానికి యోగాంధ్ర ప్రత్యేక క్యాలెండర్ విడుదల
రాజమహేంద్రవరం, 26 మే (హి.స.) కలెక్టరేట్, జిల్లాలో యోగాంధ్ర ప్రచార కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక క్యాలెండర్‌ విడుదల చేసినట్లు ఆదివారం జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా సోమవారం నుంచి వచ్చే నెల 20 వరకు జిల్లాలో ఒక్కో రోజు
యోగేంద్ర ప్రచార కార్యక్రమానికి యోగాంధ్ర ప్రత్యేక క్యాలెండర్ విడుదల


రాజమహేంద్రవరం, 26 మే (హి.స.)

కలెక్టరేట్, జిల్లాలో యోగాంధ్ర ప్రచార కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక క్యాలెండర్‌ విడుదల చేసినట్లు ఆదివారం జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా సోమవారం నుంచి వచ్చే నెల 20 వరకు జిల్లాలో ఒక్కో రోజు ఒక్కొక్క రంగం వారితో యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నామని, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్‌ను అనుసరించి ఈ ప్రణాళిక రూపొందించామని తెలిపారు. సుశిక్షితులైన యోగా గురువుల ప్రత్యక్ష పర్యవేక్షణలో యోగాభ్యాసం ఉంటుందన్నారు. జిల్లాలో నాలుగు పర్యాటక ప్రదేశాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్‌ 1న రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్‌ వద్ద, 7న కడియం సత్యదేవ నర్సరీ వద్ద, 14న కొవ్వూరు గోష్పాదక్షేత్రం వద్ద, 20న దివాన్‌చెరువు నగరవనం వద్ద యోగా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. యోగాపై పోటీలు నిర్వహించి జిల్లాస్థాయి విజేతలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 21న విశాఖపట్నంలో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande