హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త.. త్వరలో ప్రారంభం కానున్న కొండాపూర్ ఫ్లైఓవర్..!
హైదరాబాద్, 27 మే (హి.స.) హైదరాబాద్ నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ ఫ్లై ఓవర్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరవాసులకు, ప్రధానంగా ఐటీ కారిడార్లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్
ఫ్లైఓవర్ కొండాపూర్


హైదరాబాద్, 27 మే (హి.స.) హైదరాబాద్ నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ ఫ్లై ఓవర్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరవాసులకు, ప్రధానంగా ఐటీ కారిడార్లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్కు వెళ్లే అత్యాధునిక మల్టీ-లెవెల్ ఫ్లై ఓవర్ నిర్మాణం దాదాపు పూర్తయింది. ఈ ఫ్లై ఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించనున్నారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. ప్రయాణ సమయం ఆదా కానుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande