నిర్మల్ జిల్లా కలెక్టర్ పై మంత్రి సీతక్క ఆగ్రహం..
హైదరాబాద్, 27 మే (హి.స.) నిర్మల్ జిల్లా కలెక్టర్ పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేసింది. నాయక్ పోడులు అంటే నిర్మల్ జిల్లా కలెక్టర్ కు తెలియకపోవడం బాధాకరం అన్నారు. అధికారిగా ఉన్నప్పుడు వాళ్లు అన్ని తెలుసుకోవాలని సూచించింది. ఏ కులం, ఏ రిజర్వేషన్ వస
మంత్రి సీతక్క


హైదరాబాద్, 27 మే (హి.స.)

నిర్మల్ జిల్లా కలెక్టర్ పై మంత్రి

సీతక్క ఆగ్రహం వ్యక్తం చేసింది. నాయక్ పోడులు అంటే నిర్మల్ జిల్లా కలెక్టర్ కు తెలియకపోవడం బాధాకరం అన్నారు. అధికారిగా ఉన్నప్పుడు వాళ్లు అన్ని తెలుసుకోవాలని సూచించింది. ఏ కులం, ఏ రిజర్వేషన్ వస్తదో తెలియకపోవడం వారి తప్పు.. రాజ్యంగాన్ని చదవాలని తెలిపింది. ఏ కులం వారికి ఏ ఏ రిజర్వేషన్లు, ఏం హక్కులు ఉన్నాయే తెలుసుకోని వాటిని అమలు చేయాలని చెప్పుకొచ్చింది. ఇలాంటి సమస్య ఎక్కడెక్కడా ఉందో నా దృష్టికి తీసుకురండీ.. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా సర్టిఫికెట్ల సమస్య పరిష్కరించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లకు లెటర్లు పంపిస్తామని మంత్రి సీతక్క వెల్లడించింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande