వరంగల్ జిల్లాలో డ్రగ్ కంట్రోల్ అధికారుల ఆకస్మిక తనిఖీలు..
తెలంగాణ, 27 మే (హి.స.) వరంగల్ జిల్లాలో డ్రగ్ కంట్రోల్ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆర్ఎంపీ, మెడికల్ షాపులపై తనిఖీలు నిర్వహించారు. వరంగల్ గిర్మాజిపేటలో సాయికిరణ్ పౌల్ట్రీ, వెటర్నరీ మెడికల్ షాపుపై తనిఖీలు చేశారు. గుర్తింపు లేని, నకిల
డ్రగ్ కంట్రోల్ అధికారులు


తెలంగాణ, 27 మే (హి.స.)

వరంగల్ జిల్లాలో డ్రగ్ కంట్రోల్ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆర్ఎంపీ, మెడికల్ షాపులపై తనిఖీలు నిర్వహించారు. వరంగల్ గిర్మాజిపేటలో సాయికిరణ్ పౌల్ట్రీ, వెటర్నరీ మెడికల్ షాపుపై తనిఖీలు చేశారు. గుర్తింపు లేని, నకిలీ వెటర్నరీ మందులు పెద్ద మొత్తంలో స్టాక్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో రూ. 2.5 లక్షల విలువైన 26 రకాల వెటర్నరీ మందులు సీజ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande