భూముల కొలతల్లో సర్వేయర్ల పాత్ర కీలకo.. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా
తెలంగాణ, 27 మే (హి.స.) భూముల కొలతల్లో సర్వేయర్ల పాత్ర కీలకమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణ కారయక్రమంలో ఆయన మాట్లాడారు. భూముల కొలతల్లో సర్వేయర్ల పాత్ర చాలా ముఖ్యమని, భూమి సరిహద్దులను గుర్తించడం,
ఆదిలాబాద్ కలెక్టర్


తెలంగాణ, 27 మే (హి.స.)

భూముల కొలతల్లో సర్వేయర్ల పాత్ర

కీలకమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణ కారయక్రమంలో ఆయన మాట్లాడారు. భూముల కొలతల్లో సర్వేయర్ల పాత్ర చాలా ముఖ్యమని, భూమి సరిహద్దులను గుర్తించడం, కొలతలను తీసుకోవడం, భూమి నమూనాలను తయారు చేయడం ద్వారా సర్వేయర్లు భూమిని సరిగ్గా ఉపయోగించుకోవడానికి, ప్లాన్ చేయడానికి సహాయపడతారు.

భూములకు సంబంధించి శిక్షణలో ఆన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రత్యేకించి రెవెన్యూకు సంబంధించి గ్రామాలు, మండలాల అంతర్గత సరిహద్దుల నిర్ణయంలో అలాగే అంతర్గత సరిహద్దుల వివాదాల పరిష్కారానికి నిర్వహించే సర్వే విషయంలో సర్వేయర్లదే ముఖ్యపాత్ర అని పేర్కొన్నారు. సర్వేయర్లు శిక్షణకు హాజరై జాగ్రత్తగా అన్ని అంశాలను క్షుణ్ణంగా విని అర్థం చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం శిక్షణకు వారికి సర్వే సామాగ్రిని పంపిణీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande