అమరావతి, 28 మే (హి.స.)
ముఖ్యమంత్రి చంద్రబాబు యోగాంధ్ర తీర్మానం ప్రవేశ పెట్టారు. రెండు నిమిషాలు మౌనంగా మెడిటేషన్ చేసి తీర్మానాన్ని బలపరచమని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీ యుగంలో ఉన్నాం.. వత్తిడితో ఉన్నాం.. గత ఐదేళ్లలో పార్టీ కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పడ్డారు అని తెలిపారు. యోగాను ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకుని, సాధన చేయాలి అని సూచించారు. 11వ అంతర్జాతీయ యోగాను ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా పెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు.. జూన్ 27వ తేదీన విశాఖపట్నంలో జరిగే యోగా డే చారిత్రక ఘటన.. ప్రతి ఒక్కరూ యోగను తమ జీవితంలో భాగం చేసుకోవాలి అన్నారు. ఇక, వేద కాలం నుంచి యోగా శాస్త్రం ఉంది.. పతంజలి మహర్షి మనకు అద్భుతమైన యోగాను ఇచ్చారు అని సీఎం చంద్రబాబు తెలిపారు.
అయితే, సులువైన ఆసనాలతో యోగా ప్రాక్టీస్ చేసి
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ