తెలంగాణ రాజకీయ, సాంస్కృతిక చైతన్య దీపిక సురవరం ప్రతాపరెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, 28 మే (హి.స.) తెలంగాణ రాజకీయ, సాంస్కృతిక, సాంఘీక చైతన్య ఉద్యమ దీపిక సురవరం ప్రతాపరెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. బుధవారం వారి జయంతి సందర్భంగా సీఎం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను రేవంత్ రెడ్డి గుర్తు చ
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 28 మే (హి.స.)

తెలంగాణ రాజకీయ,

సాంస్కృతిక, సాంఘీక చైతన్య ఉద్యమ దీపిక సురవరం ప్రతాపరెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. బుధవారం వారి జయంతి సందర్భంగా సీఎం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆంధ్రుల సాంఘీక చరిత్రకు జీవం పోసిన మహానీయుడని కొనియాడారు. గోలకొండ పత్రిక ద్వారా ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని రగిలించిన స్వాతంత్య్రోద్యమ యోధుడు, తొలి తెలంగాణ వైతాళికుడైన సురవరం సేవలు మరువలేనివని స్మరించుకున్నారు. కాగా ఇటీవల పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande