న్యూజిలాండ్ పర్యటనకు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
హైదరాబాద్, 29 మే (హి.స.) న్యూజిలాండ్ లోని తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ జూన్ 2న నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకుగాను ప్రముఖ కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ బుధవారం రాత్రి న్యూజిలాండ్ బయలుదేరి వెళ్లారు.
న్యూజిలాండ్ పర్యటనకు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్


హైదరాబాద్, 29 మే (హి.స.)

న్యూజిలాండ్ లోని తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ జూన్ 2న నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకుగాను ప్రముఖ కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ బుధవారం రాత్రి న్యూజిలాండ్ బయలుదేరి వెళ్లారు.

న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో జరగనున్న ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాలని తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షులు కల్యాణ్ రావు కాసుగంటి ఆహ్వానం మేరకు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ జూన్ 9వ తేదీ వరకు ఆ దేశంలో పర్యటించనున్నారు. న్యూజిలాండ్ లోని వివిధ ప్రదేశాల్లో జరిగే ఇతర సమావేశాల్లో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొని, అక్కడ నివసిస్తున్న ప్రవాస తెలంగాణ వాసులను కలుసుకోనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande