బీఆర్ఎస్, బీజేపీ కలిసి రాజకీయ నాటకానికి తెరలేపాయి.. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
తెలంగాణ, భువనగిరి. 29 మే (హి.స.) బీఆర్ఎస్, బీజేపీ కలిసి రాజకీయ నాటకానికి తెరలేపాయని, కవిత వ్యాఖ్యలను చూస్తే ఇదే స్పష్టం అవుతున్నది భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.
భువనగిరి ఎంపీ


తెలంగాణ, భువనగిరి. 29 మే (హి.స.)

బీఆర్ఎస్, బీజేపీ కలిసి రాజకీయ నాటకానికి తెరలేపాయని, కవిత వ్యాఖ్యలను చూస్తే ఇదే స్పష్టం అవుతున్నది భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. మేము ఊహించనట్లుగానే బీజేపీతో బీఆర్ఎ స్ బేరసారాలు చేసిందని, లిక్కర్ స్కామ్ నుంచి కవితను బయటపడేయడానికి బీజేపీ వద్ద తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీఆర్ఎస్ తాకట్టుపెట్టిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ 8 మంది ఎంపీలు గెలవడానికి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడానికి ఈ రెండు పార్టీల ఒప్పందమేనని అర్థం అవుతున్నదన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande