100 శాతం ఉత్తీర్ణత సాధించిన గురుకులానికి ఐదు లక్షల నజరానా..
తెలంగాణ, పెద్దపల్లి. 29 మే (హి.స.) పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గరేపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయం లో ఇటీవల విడుదలైన పదో తరగతి, ఇంటర్మీడియట్ లో విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందుకు గాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవం
సీఎం రేవంత్ రెడ్డి


తెలంగాణ, పెద్దపల్లి. 29 మే (హి.స.)

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గరేపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయం లో ఇటీవల విడుదలైన పదో తరగతి, ఇంటర్మీడియట్ లో విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందుకు గాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురుకుల విద్యాలయ అభివృద్ధి కోసం రూ.ఐదు లక్షల చెక్కు అందజేశారు.

ఈ సందర్భంగా ఈనెల 28న హైదరాబాదులోని ప్రజా భవన్ లో ప్రిన్సిపాల్ గిరిజను అభినందించి సన్మానించారు.గర్రెపల్లి గురుకుల విద్యార్థులు విద్యలో రాణించి మంచి ఫలితాలు సాధించినందుకు పలువురు ప్రిన్సిపల్తో పాటు అధ్యాపక సిబ్బందిని అభినందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande