తెలంగాణ, మహబూబ్ నగర్ 30 మే (హి.స)
ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కృష్ణ, తుంగభద్ర నదులకు వరద మొదలైంది. కృష్ణమ్మకు ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ఎగువనుంచి 97 క్యూసెక్కుల వరస్తుండటంతో ప్రాజెక్టు 10 గేట్లను తెరిచిన అధికారులు దిగువకు 90,394 క్యూసెక్కులను శ్రీశైలం జలాశయం వైపు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థం 9.657 టీఎంసీలు కాగా, ఇప్పుడు 7.740 టీఎంసీలు ఉన్నాయి. జూరాల నిటీమట్టం 318.51 మీటర్లు. ప్రస్తుతం 317.55 మీటర్ల వద్ద నీటిమట్టం ఉన్నది.
ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టు నుంచి 90,394 క్యూసెక్కులు, సుంకేశుల జలాశయం నుంచి 8,824 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో ఉదయం 6 గంట లోల సమయానికి ప్రాజెక్టులో 818.20 అడుగల నీటిమట్టం ఉంది. నీటి నిల్వ 39.55 టీఎంసీలు ఉన్నాయి.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు