గ్రామ పరిపాలనాధికారుల పరీక్షా ఫలితాలు వెల్లడి
హైదరాబాద్, 30 మే (హి.స.) పూర్వపు వీఆర్వో, వీఆర్ఎల నుంచి ఆసక్తి కలిగిన వారిని గ్రామ పాలనాధికారులుగా నియయమించేదుకు ఇటీవల లిఖితపూర్వక పరీక్షను నిర్వహించారు. ఈ నెల 25న అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్ష జరగగా.. కేవలం ఐదు రోజుల్లోనే వారి సమాధాన పత్రాలను వ్య
రిజల్ట్స్


హైదరాబాద్, 30 మే (హి.స.)

పూర్వపు వీఆర్వో, వీఆర్ఎల నుంచి ఆసక్తి కలిగిన వారిని గ్రామ పాలనాధికారులుగా నియయమించేదుకు ఇటీవల లిఖితపూర్వక పరీక్షను నిర్వహించారు. ఈ నెల 25న అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్ష జరగగా.. కేవలం ఐదు రోజుల్లోనే వారి సమాధాన పత్రాలను వ్యాల్యూయేషన్ చేశారు. ఇక ఆ ఫలితాలను నేడు ఫలితాలను ప్రకటించారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 10,954 పోస్టులు ఉండగా కేవలం 3550 మంది మాత్రమే పరీక్ష రాశారు. https://ccla.telangana.gov.in/Welcome.do వెబ్ సైట్లో ర్యాంకులను చూడొచ్చు. రెండు, మూడు రోజుల్లోనే ఉత్తీర్ణులైన వారికి నియామకపు పత్రాలను అందించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande