సూటిగా ఎదుర్కొనే ధైర్యంలేక దిగజారుడు రాజకీయాలు.. పీసీసీ చీఫ్ పై హరీశ్ రావు ఫైర్
హైదరాబాద్, 31 మే (హి.స.) బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్తో రహస్యంగా సమావేశమయ్యారన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. పీసీసీ అధ్యక్ష హోదాలో ఉండి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సూటిగా ఎ
హరీష్ రావు


హైదరాబాద్, 31 మే (హి.స.)

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్తో రహస్యంగా సమావేశమయ్యారన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. పీసీసీ అధ్యక్ష హోదాలో ఉండి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సూటిగా ఎదుర్కొనే ధైర్యంలేక దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. విలువలు విస్మరించి రేవంత్ రెడ్డి బాటలోనే నడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బట్ట కాల్చి మీద వేసినంత మాత్రానా అబద్దాలు, నిజం అయిపోవన్నారు. ఇలాంటి ఆరోపణలు మానుకుని ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలుపై దృష్టిపెట్టాలని చురకలంటించారు.

'

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande