గిరిజన బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో మంత్రి పొంగులేటి శ్రమదానం
తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 31 మే (హి.స.) కొత్తగూడెం మండలంలోని కిన్నెరసాని వద్ద గల గిరిజన బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి శనివారం ఉదయం శ్రమదానం చేశారు.
మంత్రి పొంగులేటి


తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 31 మే (హి.స.) కొత్తగూడెం మండలంలోని కిన్నెరసాని వద్ద గల గిరిజన బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి శనివారం ఉదయం శ్రమదానం చేశారు. ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి వారు స్వయంగా పిచ్చిమొక్కలను తొలగించి, చెత్తను ఎత్తివేసి శుభ్రం చేశారు. అనంతరం ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ ప్రాంగణంలో మొక్క నాటారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఆదేశాల మేరకు జై బాపు, జై భీమ్ జై సంవిధాన్ నినాదంతో ముందుకెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచందర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande