వేములవాడ రాజన్న కోడెలకు దరఖాస్తులు..
తెలంగాణ, వేములవాడ. 1 జూన్ (హి.స.) వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి భక్తుల సమర్పించిన కోడెలను పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆదివారం నుంచి కోడెలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు.
రాజన్న కోడెలు


తెలంగాణ, వేములవాడ. 1 జూన్ (హి.స.)

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి భక్తుల సమర్పించిన కోడెలను పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆదివారం నుంచి కోడెలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు. మొదటి విడతలో 300 చిన్న కోడెలను పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. జియో ట్యాగింగ్ కలిగి ఉన్న వాటిని రైతులకు అందజేస్తామన్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు.

రైతులు తప్పనిసరిగా పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డుతో అధికారులు సూచించిన https://rajannasircilla.telangana.gov.in/పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. రాజన్న ఆలయ గోశాలలో ప్రస్తుతం 1250 పైగా కోడెలు ఉండగా పకడ్బందీగా పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande