తెలంగాణ, యాదాద్రి భువనగిరి. 1 జూన్ (హి.స.)
యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా భాస్కర్ రావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన గంగాధర్ రెండు నెలల క్రితం హెచ్ఎండీఏ కార్యదర్శిగా బదిలీ అవ్వగా అప్పటి నుంచి రెవెన్యూ కలెక్టర్ వీరారెడ్డి అదనపు బాధ్యతలను నిర్వహించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన భాస్కరరావు గతంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి ఆర్డీవోగా, జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ గా, యాదగిరిగుట్ట ఆలయ ఈవోగా పనిచేయడంతో జిల్లాపై మంచి అవగాహన ఉన్నట్టు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు