కోస్తా ఆంధ్రలో భారీ. ఒకటి రెండు చోట్ల.భారీ వర్షాలు పడతాయని వెల్లడి
అమరావతి, 12 జూన్ (హి.స.) విశాఖపట్నం, జూన్ 12: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. అలాగే ఉత్తర కోస్తా, దక్షిణ ఓడిశాలో ప్రసుత్తం ఉపరితల ఆవర్తనం విస్తరించిందని తెలిపింది. ఈ ప్రభావ
కోస్తా ఆంధ్రలో భారీ. ఒకటి రెండు చోట్ల.భారీ వర్షాలు పడతాయని వెల్లడి


అమరావతి, 12 జూన్ (హి.స.)

విశాఖపట్నం, జూన్ 12: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. అలాగే ఉత్తర కోస్తా, దక్షిణ ఓడిశాలో ప్రసుత్తం ఉపరితల ఆవర్తనం విస్తరించిందని తెలిపింది. ఈ ప్రభావం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

అలాగే కోస్తా ఆంధ్రాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని చెప్పింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందంది. ఈ సమయంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ సూచించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande