ఇరిగేషన్ ఏఈ నూనె శ్రీధర్ కు 14 రోజుల రిమాండ్ విధించిన ఏసీబీ కోర్ట్.. చంచల్గూడా జైలుకు తరలింపు..
హైదరాబాద్, 12 జూన్ (హి.స.) ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూట్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఇళ్లల్లో బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 13 ప్రాంతాల్లో శ్రీధర్ నివాసం తో పాటు అతడి బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ ఈ సోదాలు నిర్వహించగా.. భారీగా ఆస్తులు జ
ఇరిగేషన్ ఏఈ


హైదరాబాద్, 12 జూన్ (హి.స.) ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూట్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఇళ్లల్లో బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 13 ప్రాంతాల్లో శ్రీధర్ నివాసం తో పాటు అతడి బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ ఈ సోదాలు నిర్వహించగా.. భారీగా ఆస్తులు జప్తు చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. అనంతరం అక్రమాస్తుల కేసులో ఆయనను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు కోర్టులు హాజరు పరిచారు. దీంతో ఈ రోజు ఉదయం ఏసీబీ కోర్టు నూనే శ్రీధర్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయన్ను ఈ రోజు తెల్లవారుజామున చంచల్గూడ జైలు కు తరలించారు. అలాగే శ్రీధర్ కు చెందిన అనేక బ్యాంకు లాకర్లను ఓపెన్ చేయడానికి ఏసీబీ కస్టడీ కోరనున్నట్లు తెలుస్తుంది.

బుధవారం ఉదయం జరిగిన దాడుల్లో.. తెల్లాపూర్ విల్ల, షేక్ పేటలో ప్లాట్, కరీంనగర్ లో మూడు ఓపెన్ ప్లాట్లు, అమీర్ పేటలో వాణిజ్య భవనం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో మూడు ఇండిపెండెంట్ హౌస్లు ఉన్నాయని గుర్తించింది. వీటితో పాటు 16 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు. వీటితో పాటుగా రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకులో భారీగా నగదు నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. శ్రీధర్ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో వందల కోట్లలో ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande