హనుమకొండ, 12 జూన్ (హి.స.)
గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో నోటు పుస్తకాలు పంపిణీ చేసేందుకు విద్యాశాఖాధికారులు సిద్ధమయ్యారు. జిల్లావ్యాప్తంగా ముద్రించిన పుస్తకాలు ఆయా పాఠశాలలకు చేరాయి. కాగా, హనుమకొండ లష్కర్‌బజార్‌లోని మర్కజీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేస్తుండగా మాజీ సీఎం కేసీఆర్ ఫొటోతో ఉన్న నోట్‌బుక్ రావడంతో ఒక్కసారిగా ఉపాధ్యాయులు అవాక్కయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు ఆ నోట్‌బుక్‌ను మూలనపడేసి ఇతర నోట్‌బుక్స్‌ను పంపిణీ చేయడం విశేషం. ప్రభుత్వం సరఫరా చేస్తున్న నోట్‌బుక్స్‌లో ఆ ఒక్క నోట్‌బుక్‌పై కేసీఆర్ ఫొటో రావడంపై ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. వెంటనే విషయాన్ని విద్యాశాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లిన్నట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..