హైదరాబాదులో భారీ వర్షం..లోతట్టు ప్రాంతాలు జలమయం.. భారీ ట్రాఫిక్ జామ్
హైదరాబాద్, 13 జూన్ (హి.స.) భాగ్యనగరంలో నేటి మధ్యాహ్నం భారీ వర్షం పడింది. గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కుండపోత వర్షం పడుతోంది. నగరంలోని నాంపల్లి, లక్షీకపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, ట్యాంక్బండ్, హిమాయత్ నగర్, నారాయణగూడ, ముషీరాబాద్, ఆ
హైదరాబాదులో వర్షం


హైదరాబాద్, 13 జూన్ (హి.స.) భాగ్యనగరంలో నేటి మధ్యాహ్నం భారీ వర్షం పడింది.

గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కుండపోత వర్షం పడుతోంది. నగరంలోని నాంపల్లి, లక్షీకపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, ట్యాంక్బండ్, హిమాయత్ నగర్, నారాయణగూడ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అబిడ్స్, కోటి, గోషామహాల్, చార్మినార్, మలక్పేట్, చాదర్ ఘాట్లలో వర్షం పడుతోంది.

భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఈ నేపథ్యంలో అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని GHMC అధికారులు నగర ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande