హైదరాబాద్, 14 జూన్ (హి.స.)
సినీనటి కల్పికా గణేష్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. 67 ఐటీఏ 2000-2008,79,356 BNS ప్రకారంగా కేసు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి ధూషించింది అంటూ కల్పికపై బాధితురాలు కీర్తన ఫిర్యాదు చేసింది.
ఆన్‌లైన్‌లో అభ్యంతరకరమైన రీతితో వేధింపులకు కల్పిక పాల్పడుతోందని ఫిర్యాదులో పేర్కొంది. సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టుకోవడంతో పాటు బాధితురాలికి మెసేజ్ పెట్టి దారుణంగా మాట్లాడిందని బాధితురాలు కీర్తన తెలిపింది. ఇన్‌బాక్స్ మెసేజ్‌లు స్టేటస్ పెట్టిన స్క్రీన్ షాట్లను పోలీసులకు ఆధారాలను బాధితురాలు సమర్పించింది. ఈ మేరకు కల్పికపై రెండో కేసు నమోదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు