ఎల్లుండి తెలంగాణ ఇంట‌ర్‌ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల
హైదరాబాద్, 14 జూన్ (హి.స.) ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈనెల 16వ తేదీన విడుదల చేయనుంది. సోమవారం మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ అడ్వాన్స్‌డ
తెలంగాణ ఇంటర్


హైదరాబాద్, 14 జూన్ (హి.స.)

ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈనెల 16వ తేదీన విడుదల చేయనుంది. సోమవారం మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి మే 29 వరకు నిర్వహించారు. ఫెయిల్ అయిన విద్యార్థులు సహా మార్కులు పెంచుకోవాలనుకునే విద్యార్థులు కూడా ఈ పరీక్షలు రాశారు. దీంతో ఈ సారి ఇంటర్ సప్లిమెంటరీలో విద్యార్ధుల సంఖ్య భారీగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 4.2 లక్షల మంది విద్యార్ధులు ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande