ఆధునిక వసతులతో మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణం.. పటాన్చెరు ఎమ్మెల్యే
సంగారెడ్డి, 15 జూన్ (హి.స.) పటాన్ చెరు నియోజకవర్గంలో ఆధునిక వసతులతో మోడల్ పోలీస్ స్టేషన్లు నిర్మిస్తున్నామని స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బొల్లారం మున్సిపల్ పరిధిలోని సర్వేనెంబర్ 248లో ఎకరా స్థలంలో హెటిరో పరిశ్రమ సౌజన్యంతో ర
పటాన్చెరు ఎమ్మెల్యే


సంగారెడ్డి, 15 జూన్ (హి.స.)

పటాన్ చెరు నియోజకవర్గంలో

ఆధునిక వసతులతో మోడల్ పోలీస్ స్టేషన్లు నిర్మిస్తున్నామని స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బొల్లారం మున్సిపల్ పరిధిలోని సర్వేనెంబర్ 248లో ఎకరా స్థలంలో హెటిరో పరిశ్రమ సౌజన్యంతో రూ.3.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన మోడల్ పోలీస్ స్టేషన్ పనులకు ఆదివారం శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఐజి సత్యనారాయణ గౌడ్, జిల్లా ఎస్పీ పరితోష్ సంతోష్ కుమార్ లతో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినీ ఇండియాగా పేరొందిన పటాన్ చెరు నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు అందించాలన్న లక్ష్యంతో నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande