అమరావతి, 18 జూన్ (హి.స.)
: రాజధాని అమరావతిలోని యువత కోసం సీఆర్‌డీఏ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. సీఆర్‌డీఏ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 5 సంస్థల్లో 400 పోస్టుల భర్తీకి జాబ్ మేళా ఏర్పాటు చేశారు. తుళ్లూరులోని సీఆర్‌డీఏ కార్యాలయంలో నిర్వహించిన జాబ్ మేళాలో పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. రాజధాని ప్రాంతంలో యువత నిరుద్యోగులుగా ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు ప్రతి నెలా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు సీఆర్‌డీఏ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ