గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
ముంబై, 18 జూన్ (హి.స.)ఇంట్లో శుభకార్యం ఏదైనా ఉంటే.. కచ్చితంగా బంగారం కొనాల్సిందే. పండుగ వచ్చిందంటే చాలు.. మహిళలకు బంగారం ఉండాల్సిందే. మరి ఈ మధ్యకాలంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయ్. కొన్నిరోజులు పెరుగుతూపోతున్న బంగారం ధరలు.. మరికొన్ని ర
GOLD


ముంబై, 18 జూన్ (హి.స.)ఇంట్లో శుభకార్యం ఏదైనా ఉంటే.. కచ్చితంగా బంగారం కొనాల్సిందే. పండుగ వచ్చిందంటే చాలు.. మహిళలకు బంగారం ఉండాల్సిందే. మరి ఈ మధ్యకాలంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయ్. కొన్నిరోజులు పెరుగుతూపోతున్న బంగారం ధరలు.. మరికొన్ని రోజులు నేలచూపులు చూస్తున్నాయ్. ఇక గత మూడు రోజుల్లో ధరలు చూస్తే భారీగా తగ్గాయి. గడిచిన మూడు రోజుల్లో 24 క్యారెట్ల గోల్డ్ రేట్స్ రూ. 1320 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1210 మేరకు తగ్గింది. అటు వెండి ధరలు అయితే పైపైకి ఎగబాకుతున్నాయి. గడిచిన రెండు రోజుల్లో రూ. 200 మేరకు పెరిగింది వెండి ధర. మరి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 91,990గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,00,360గా ఉంది. అటు తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ. 1 లక్ష పది వేలు దాటింది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ. 1,20,100గా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande