హైదరాబాద్, 18 జూన్ (హి.స.)
పదవుల మీద ఉన్న ధ్యాస.. తెలంగాణ ప్రజలపై లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎనకటికి ఎవడో ఏదీ అడగకుంటే.. సచ్చిందాక సాకుతా అన్నాడట.. ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఉందని ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు.“ఏస్తున్న రైతుభరోసా సరే. మరి ఎగ్గొట్టిన రైతుభరోసా సంగతి ఏంది..? ఎగ్గొట్టిన వడ్ల బోనస్ సంగతి ఏంది..? ఎగ్గొట్టిన తులం బంగారం, కళ్యాణలక్ష్మి పరిస్థితి ఏంటి..? ఎగ్గొట్టిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పరిస్థితి ఏంటి..? ఎగ్గొట్టిన రూ.2500 మహాలక్ష్మి పథకం పరిస్థితి ఏంటి..? ఆడబిడ్డలకు ఎలక్ట్రిక్ స్కూటీల పరిస్థితి ఏంటి..? ఆగిపోయిన రైతుబీమా పరిస్థితి ఏంటి..? ఆగిపోయిన రుణమాఫీ పరిస్థితి ఏంటి..?” అని కేటీఆర్ నిలదీశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్