జగిత్యాల జిల్లాలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు..
తెలంగాణ, జగిత్యాల. 19 జూన్ (హి.స.) లోక్ సభ ఫ్లోర్ లీడర్ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ కేక్ కట్ చేసి, వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్
రాహుల్ గాంధీ


తెలంగాణ, జగిత్యాల. 19 జూన్ (హి.స.)

లోక్ సభ ఫ్లోర్ లీడర్ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ కేక్ కట్ చేసి, వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ.. భారత దేశ భవిష్యత్ ఆశా జ్యోతి రాహుల్ గాంధీ అని, త్యాగాల కుటుంబం నుండి వచ్చిన నాయకుడు ప్రధాన మంత్రి పదవి అవకాశం వచ్చినా దేశం కోసం పార్టీ కోసం పనిచేస్తున్నారనీ పేర్కొన్నారు.

ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ పునాది వేసింది, రాహుల్ గాంధీ, తాత జవహర్ లాల్ నెహ్రూ అని తెలిపారు. దేశంలో ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు లేదని, ప్రతిపక్ష నాయకుడుగా, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ ప్రజల పక్షాన ఉన్నారని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande