కేంద్రమంత్రి వద్ద లోకేశ్ కీలక ప్రతిపాదనలు... ఆ రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
ఢిల్లీ(, 19 జూన్ (హి.స.)ఏపీ(Ap)లో క్రీడలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా స్టేడియాలను నిర్మించాలని, రాష్ట్ర రాజధానిలో స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్(Minister Nar
కేంద్రమంత్రి వద్ద లోకేశ్ కీలక ప్రతిపాదనలు... ఆ రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్


ఢిల్లీ(, 19 జూన్ (హి.స.)ఏపీ(Ap)లో క్రీడలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా స్టేడియాలను నిర్మించాలని, రాష్ట్ర రాజధానిలో స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఈ మేరకు మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) సైతం అడుగులు వేస్తున్నారు. ఢిల్లీ(Delhi)లో పర్యటిస్తున్న ఆయన తాజాగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ(Mansukh Mandaviya)ను లోకేశ్ కలిశారు. ఏపీ రాజధానిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే స్పోర్ట్ సిటీ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రపంచస్థాయి శిక్షణ, సౌకర్యాలు కల్పించడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పలు క్రీడా విభాగాల్లో అథ్లెటిక్స్‌కు మద్దతివ్వడమే ఈ స్పోర్ట్స్ సిటీ ప్రధాన లక్ష్యమని కేంద్రమంత్రికి లోకేశ్ వివరించారు. వీటితో పాలు మరిన్ని విన్నపాలు కూడా లోకేశ్ చేశారు.

‘‘గుంటూరు ఏఎన్‌యూలో అథ్లెటిక్స్, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్, కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో హాకీ, షూటింగ్‌పై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లకు ఆమోదం తెలిపాలి. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిపాదించిన 39 ప్రాజెక్టులకు రూ. 341.57కు త్వరగా విడుదల చేయాలి. తిరుపతిలో స్పోర్ట్స్ సిటీ అథారిటీ ఆఫ్ ఇండియా రిజినల్ కేంద్రంతో పాటు అథ్లెటిక్స్, రెజ్లింగ్ స్టేట్ లెవల్ సెంటర్‌ను సైతం నిర్మించాలి. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఖేలో ఇండియా సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఏపీ క్రీడాకారులకు రైల్వే స్పోర్ట్స్ కన్సెషన్ పాసులు మంజూరు చేయాలి. రాష్ట్రంలో ఐఎస్ఐ ఆస్పత్రుల ఏర్పాటుతో పాటు అభివృద్ధి సైతం సహకరించాలి.’’ అని కేంద్రమంత్రికి లోకేశ్ విజ్ఞప్తులు చేశారు. ఇక లోకేశ్ విజ్ఞప్తులకు కేంద్రమంత్రి మన్ సుఖ్ మాండవీయ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ సిటీ, ఈఎస్ఐ ఆస్పత్రులపై హామీ ఇచ్చినట్లు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande