అమరావతి, 20 జూన్ (హి.స.)
: రాజధాని అమరావతి ప్రాంత మహిళలపై దారుణ వ్యాఖ్యలు చేసిన సీనియర్ పాత్రికేయుడు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజును తుళ్లూరు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జూన్ 11న అరెస్టైన ఆయన గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ తర్వాత జీజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మూడు రోజుల విచారణ కోసం తుళ్లూరు పీఎస్‌కు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ