కెసిఆర్ హయాంలోనే అభివృద్ధి.. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
తెలంగాణ, జగిత్యాల. 20 జూన్ (హి.స.) మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే గ్రామాలన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మొగిలిపేట గ్రామంలో ఓపెన్ జిమ్, గొర్రె పల్లి గ్రామంలో నూతన జీపీ కార్యాలయ భవనాన్ని శుక్రవారం ప్రార
ఎమ్మెల్యే సంజయ్


తెలంగాణ, జగిత్యాల. 20 జూన్ (హి.స.)

మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే గ్రామాలన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మొగిలిపేట గ్రామంలో ఓపెన్ జిమ్, గొర్రె పల్లి గ్రామంలో నూతన జీపీ కార్యాలయ భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో పుట్టి పెరిగిన మాజీ సీఎం కేసీఆర్ కు ప్రజల కష్టసుఖాలన్నీ స్పష్టంగా తెలుసని, అందుకే గత ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధికి పెద్ద పీట వేసినట్లు తెలిపారు. ఇక్కడ అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande