బాన్సువాడను విద్య, వైద్య రంగానికి హబ్ గా తీర్చిదిద్దుతాం.. రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, 20 జూన్ (హి.స.) కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడను విద్య, వైద్య రంగానికి హబ్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో బాన్సువాడ నియోజకవర్గం నసరుల్లాబాద్ మండలం దుర్కి
పోచారం


హైదరాబాద్, 20 జూన్ (హి.స.)

కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడను విద్య, వైద్య రంగానికి హబ్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో బాన్సువాడ నియోజకవర్గం నసరుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివారులో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ Bsc నర్సింగ్ కళాశాల భవన సముదాయ పనులపై సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ తో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ Bsc నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులను ఉద్దేశించి పోచారం మాట్లాడుతూ రూ.40 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ Bsc నర్సింగ్ కళాశాల భవన సముదాయ పనులను త్వరితగతిన పూర్తి చేసి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ నర్సింగ్ కళాశాలను బాలికలు సద్వినియోగం చేసుకోవాలని, బాలికలకు విద్య ఎంతో అవసరం, విద్యతోనే సామాజికంగా, ఆర్థికంగా మార్పు వస్తుందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande