శంషాబాద్ ఎయిర్పోర్టులో బ్రిటీష్ ఎయిర్ వేస్ నిలిపివేత.. రెండు గంటలుగా రన్వే పైనే!
హైదరాబాద్, 22 జూన్ (హి.స.) ఇరాన్ పై అమెరికా మెరుపు దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం నిలిచిపోయింది. ఇవాళ హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం.. శంషాబాద్ ఎయిర్పోర్టులోన
బ్రిటిష్ ఎయిర్వేస్


హైదరాబాద్, 22 జూన్ (హి.స.)

ఇరాన్ పై అమెరికా మెరుపు దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం నిలిచిపోయింది. ఇవాళ హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం.. శంషాబాద్ ఎయిర్పోర్టులోనే నలిపివేశారు. దీంతో రెండు గంటలుగా టేకాఫ్ తీసుకోకుండా రన్ వే పైనే విమానం ఉండిపోయింది. యుద్ధం కారణంగా ఇంకా అనుమతి రాలేదని అధికారులు పేర్కొన్నారు. ఇక, విమానం టేకాఫ్ కాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు.

రెండు గంటలుగా లండన్ వెళ్తున్న బ్రిటీష్ ఎయిర్ వేస్ రెండు గంటలుగా శంషాబాద్ ఎయిర్ పోర్టులోని రన్ వేపైనే నిలిపివేశారని, రూట్ క్లియరెన్స్ రాలేదని సిబ్బంది చెబుతున్నారని, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఓ వ్యక్తి వీడియో షేర్ చేశారు. ఈ మేరకు విమానంలో ప్రయాణికులు అయోమయంలో ఉన్న దృశ్యాలను షేర్ చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande