గృహ రుణాలను.అందించే ఎల్ ఐ సీ హౌసింగ్ ఫైనాన్స్ కొత్త రుణాల పై.50 బేసిస్ పాయింట్లు.తగ్గించింది
అమరావతి, 22 జూన్ (హి.స.), హైదరాబాద్‌: గృహరుణాలను అందించే ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కొత్త గృహరుణాలపై వడ్డీ రేటును 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. దీంతో కొత్త గృహరుణ గ్రహీతలకు 7.50 శాతం నుంచి రుణం లభించనుంది. ఈ వడ్డీ రేటు ఇప్పటికే అమల్లోకి వచ్చింది.
గృహ రుణాలను.అందించే ఎల్ ఐ సీ హౌసింగ్ ఫైనాన్స్ కొత్త రుణాల పై.50 బేసిస్ పాయింట్లు.తగ్గించింది


అమరావతి, 22 జూన్ (హి.స.), హైదరాబాద్‌: గృహరుణాలను అందించే ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కొత్త గృహరుణాలపై వడ్డీ రేటును 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. దీంతో కొత్త గృహరుణ గ్రహీతలకు 7.50 శాతం నుంచి రుణం లభించనుంది. ఈ వడ్డీ రేటు ఇప్పటికే అమల్లోకి వచ్చింది. కొత్తగా ఇంటి రుణం తీసుకునే వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందని సంస్థ పేర్కొంది. ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 36వ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో గృహరుణాలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈఓ త్రిభువన్‌ అధికారి పేర్కొన్నారు. అందుబాటు ధర ఇళ్లు కొనే మధ్య తరగతి వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande