అమరావతి, 22 జూన్ (హి.స.)గత 20 రోజులుగా మహారాష్ట్రలో విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో నదుల్లో భారీ వరద ఉధృతి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. పూర్తి వర్షాకాలం రాకముందే ఈ సీజన్లో రెండోసారి జూరాల డ్యామ్ గేట్లను అధికారులు ఎత్తి వరద నీటిని విడుదల చేశారు. ఈ వరద నీరు నేరుగా కృష్ణా నదిలోకి చేరి శ్రీశైలం జలాశయాన్ని చేరుతోంది. ఇప్పటికే గత వానకాలంలో వచ్చిన వరదలతో శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు గణనీయంగా పెరిగాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ