అమరావతి, 22 జూన్ (హి.స.)తమిళనాడులో కార్తికేయుడి భక్తులతో నేడు బీజేపీ నిర్వహిస్తూన్న మురుగన్ మహా భక్త సమ్మేళనం రాష్ట్రంలో పోలిటికల్ హీట్ పెంచింది. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీతో డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్దానికి కారణం అయ్యింది. అమ్మ తిడల్, పాండికొవిల్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనానికి కర్ణాటక, మహాAP రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ నుంచి దాదాపు ఐదు లక్షల మందికి పైగా భక్తులు హాజరు కానున్నారు. ఎన్నికలకు ఎడాది ముందుగానే సై అంటే సై అంటున్న పార్టీలు.. ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా అడుగులు వేస్తున్నాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ