బెంగళూరు, 10 జూలై (హి.స.)వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆది కర్మ యోగి – నేషనల్ మిషన్ ఫర్ రెస్పాన్సివ్ గవర్నెన్స్ మొదటి ప్రాంతీయ ప్రాసెస్ ల్యాబ్ (RPL)ను ప్రారంభించింది. ఇందులో భాగంగా 20 లక్షల మంది గిరిజన కార్యకర్తలు, గ్రామ స్థాయి నాయకులతో కూడిన డైనమిక్ కేడర్‌ను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది. వారు గిరిజన ప్రాంతాలలో సమగ్ర అభివృద్ధికి పాటుబడుతూ.. చివరి మైలు వరకు సేవా బట్వాడాను బలోపేతం చేస్తారు.
బెంగళూరులోని హోటల్ రాయల్ ఆర్చిడ్ సెంట్రల్‌లో నిర్వహించిన RPL ప్రతిష్టాత్మక జాతీయ మిషన్ కార్యాచరణ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి రాష్ట్ర మాస్టర్ ట్రైనర్‌లకు (SMTలు) శిక్షణ ఇచ్చే వ్యూహాత్మక సామర్థ్య నిర్మాణ కేంద్రంగా పనిచేస్తుంది. ఆది కర్మ యోగి అనేది ఒక కార్యక్రమం కంటే ఎక్కువ. PM-JANMAN, DAJGUA వంటి ప్రధాన కార్యక్రమాలతో అలైన్‌మెంట్ చేయబడిన ఈ మిషన్, పాలన ఆవిష్కరణలో తదుపరి అధ్యాయాన్ని ఆవిష్కరించనుంది. ఏకీకరణ, సమాజం, సామర్థ్యం స్తంభాలపై నిర్మించబడింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం మాట్లాడుతూ.. “ఆది కర్మయోగి గిరిజన భారతదేశానికి గేమ్-ఛేంజర్. ఇది సేవా, సంకల్ప్, సమర్పణ స్ఫూర్తిని సూచిస్తుంది. అంత్యోదయ నిజమైన స్వరూపం. 20 లక్షల నాయకుల ఈ కేడర్ ద్వారా మేం మన దేశంలోని అత్యంత మారుమూల మూలల్లో గౌరవం, జవాబుదారీతనం, సేవా బట్వాడాను సంస్థాగతీకరిస్తున్నాం. ఈ విధంగా అట్టడుగు స్థాయి నుంచి వికసిత్ భారత్ లక్ష్యం నేరవేరుతుంది. గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయ్కే మాట్లాడుతూ.. ఈ అభియాన్ కేవలం పాలన గురించి కాదు, ఇది మన గిరిజన సమాజాలకు గర్వం, గుర్తింపు, స్వరాన్ని పునరుద్ధరించడం గురించి. శిక్షణ పొందిన ఆది కర్మయోగి ఆశ, పరివర్తన ఏజెంట్ అవుతాడు అని అన్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల కార్యదర్శి కూడా పాల్గొని మాట్లాడారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి