ఆంధ్ర– తెలంగాణ సెంటిమెంట్ను మళ్ళీ తెర మీదకు తెచ్చేందుకు కుట్ర : ఎంపీ చామల
తెలంగాణ, యాదాద్రి భువనగిరి. 10 జూలై (హి.స.) హరీష్ రావు, కేటీఆర్ మళ్లీ తెలంగాణ సెంటిమెంటును రగిలించే ప్రయత్నం చేస్తున్నారని, కాబట్టి ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. భువనగిరి జిల్లా
ఎంపీ చామల


తెలంగాణ, యాదాద్రి భువనగిరి. 10 జూలై (హి.స.)

హరీష్ రావు, కేటీఆర్ మళ్లీ తెలంగాణ సెంటిమెంటును రగిలించే ప్రయత్నం చేస్తున్నారని, కాబట్టి ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. భువనగిరి జిల్లా కేంద్రంలో గురువారం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మిగులు బడ్జెట్ తో అధికారంలోకి వచ్చి రూ. 8 లక్షల కోట్ల అప్పు చేశాడని విమర్శించారు. తెచ్చిన అప్పును సక్రమంగా వినియోగించుంటే రాష్ట్రం ఎప్పుడో అభివృద్ధి చెందేదన్నారు.

గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ లకే పరిమితమైందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 60000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. బనకచర్ల బంకను మనకు రుద్దుదామని ప్రయత్నం చేస్తున్నారని, ఆరు నూరైనా బనకచర్ల ప్రాజెక్టును కానివ్వబోమన్నారు. కేటీఆర్ కేవలం ఒక ఎమ్మెల్యే అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయి కేటీఆర్ ది కాదన్నారు. కేసీఆర్ ను చర్చకు సిద్ధం చేయాలని కేటీఆర్ కు సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande