తెలంగాణ, రాజన్న సిరిసిల్ల 10 జూలై (హి.స.)
మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో నేషనల్ అగ్రో ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మత్స్య రైతుల దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలోని ఉత్తమ ప్రతిభ కనబరిచిన సొసైటీ సభ్యులకు ప్రశంసాపత్రాలు అందజేసి సన్మానించారు. అనంతరం చేపల స్టాల్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మత్స్య సంపద పెంపొందించడానికి తన వంతు ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఇటీవల మంత్రి శ్రీహరి కరీంనగర్ పర్యటనలో చేపల పెంపకం, మత్స్యకారుల గురించి మాట్లాడటం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని చెరువుల్లోకి సకాలంలో చేప పిల్లల పంపిణీ చేస్తుందని తెలిపారు. బలహీన వర్గాల ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందజేస్తుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు