తెలంగాణ, ఆదిలాబాద్. 10 జూలై (హి.స.)
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్,
గాదిగూడ ఉమ్మడి మండలంలో గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు లోతట్ట ప్రాంతాలు జలమయమయ్యాయి. నార్నూరు మండలంలోని బారిక్ రావు గూడ, ధన్ను గూడ, గాదిగూడ మండలంలోని మారుతి గూడ, కూనికాసా గ్రామాల సమీపంలోని వాగులు వరద నీటితో ఉప్పొంగాయి.
దీంతో గ్రామ గిరిజనుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద నీరు తగ్గేవరకు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.బారికరావు గూడలో గిరిజనులు సాహాసంతో వాగు దాటే ప్రయత్నాలు చేశారు. గాదిగూడ మండలంలోని ఖడ్కి, లోకారి, దాబా, అర్జుని ప్రధాన రహదారిపై లో లెవెల్ కల్వర్టులపై వరద నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు